శంషాబాద్ ఎయిర్పోర్టులో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విమానాలు.. ప్రయాణికుల ఆందోళన
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక కారణాలతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దయ్యాయ
శంషాబాద్ ఎయిర్పోర్ట్


హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ

ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక కారణాలతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్ని విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్-కౌలాలంపూర్, హైదరాబాద్-వియత్నాం విమానాలు సాంకేతిక లోపంతో రద్దు చేశారు. హైదరాబాద్-గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే, ఎయిర్లైన్స్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్బస్ 984 ఫ్లయిట్ ఆలస్యమైంది. శుక్రవారం రాత్రి 11గంటల నుంచి వియత్నాం వెళ్లాల్సిన ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. ఎయిర్లైన్స్ అధికారులతో ప్రయాణికులు వాగ్వాదానికి దిగారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande