
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.)
జిల్లా జడ్జిల స్థాయిలో భారీ బదిలీలు,
ప్రమోషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 46 మంది జిల్లా జడ్జిలు కొత్తగా ప్రమోటై పోస్టింగ్ పొందగా, వారిలో 13 మంది ఇప్పటికే జిల్లా జడ్జిగా పనిచేస్తున్న వారు ఉన్నారు. మిగతా 33 మంది సీనియర్ సివిల్ జడ్జిల నుంచి 65 శాతం కోటా కింద ప్రమోట్ అయ్యారు. రిజిస్ట్రార్ (IT) CPCగా జి.ప్రవీణ్ కుమార్ మాత్రమే హైకోర్టులోనే కొనసాగుతారని ఉత్తర్వులలో స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..