ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రభావితం చేస్తోంది.. TPCC చీఫ్ ఆరోపణలు
హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.) ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభావితం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ తో కలసి గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ
TPCC చీఫ్


హైదరాబాద్, 8 నవంబర్ (హి.స.)

ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభావితం చేస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ ఆయన ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షీ నటరాజన్ తో కలసి గాంధీభవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఈసీని తమ గుప్పిట్లో పెట్టుకుని ఓట్ల ఎన్నికల్లో అవకతవకలకు బీజేపీ పాల్పడుతోందని అన్నారు. 'ఓట్ చోరీ' అవకతవకలపై రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని గుర్తు చేశారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలకు భావించారని, అక్కడ ప్రజలకు అభిప్రాయలకు వ్యతిరేకంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఆ రాష్ట్రంలో 25 లక్షల ఓట్లు ఉన్నాయని.. ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉండటం దారణమని అన్నారు. ఇక పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హర్యానాలో చేర్చారని ఆరోపించారు. బిహార్లో తమకు బలం లేని చోట ఓట్లను బీజేపీ తొలగించిందని.. ఈసీ (EC)ని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే వారి నుంచి సమాధానం లేదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande