
తిరుపతి, 8 నవంబర్ (హి.స.) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుపతి జిల్లా మామండూరులో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మామండూరు అటవీప్రాంతంలో మొక్కలు నాటారు. అనంతరం మంగళం రోడ్డులోని గిడ్డంగిని పరిశీలించారు. 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఎర్రచందనం గోదాములను పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన ఎర్రచందనం అక్రమ రవాణా, ఇతర అంశాలపై దృష్టి సారించారు. ఎర్రచందనం చెట్లతో పాటు.. అటవీప్రాంతంలో ఉన్న మొక్కలు, చెట్ల పరిరక్షణై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన అధికారులతో చర్చించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV