
విజయవాడ, 8 నవంబర్ (హి.స.) బెజవాడ కనకదుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రిపై సంటకహర చవితిని (Sankatahara Chaviti) పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. నూతన యాగశాల వద్ద ఆలయ స్థానాచార్యులు వి.శివప్రసాద్ శర్మ (Siva Prasad Sharma) ఆధ్వర్యంలో పూజాధికాలను జరిపించారు. గణపతి హోమంతో పాటు విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, గణపతి హోమం (Ganapati Homam) అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమాలను ఆగమ శాస్త్రాలకు అనుగుణంగా నిర్వహించారని ఆలయ ఈఓ వికె సీనా నాయక్ (EO VK Seenaa Naik) తెలిపారు. ప్రతి నెల సంకటహర చవితికి ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. భక్తులు స్వామివారి విశేష పూజలకు హాజరై ఆశీస్సులను పొందుతారన్నారు. సంకటహర చతుర్థిని పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున లక్ష్మీ గణపతి ఆలయాన్ని (Lakshmi Ganapati Temple) సందర్శించారన్నారు. విఘ్నేశ్వరుడిని దర్శించుకొని నివేదన సమర్పించారని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV