మొంథా తుఫాను కారణంగా 24 జిల్లాల్లో పంట నష్టం
అమరావతి, 9 నవంబర్ (హి.స.) :మొంథా తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 3,27,783 మంది రైతులకు చెందిన 1,64,505 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ తేల్చింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 31,033, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422, తూ
Cyclone


అమరావతి, 9 నవంబర్ (హి.స.)

:మొంథా తుఫాన్‌ కారణంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 3,27,783 మంది రైతులకు చెందిన 1,64,505 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ తేల్చింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 31,033, కోనసీమలో 29,537, కాకినాడలో 21,422, తూర్పుగోదావరిలో 15,666, బాపట్లలో 13,258, ప్రకాశంలో 12,280, నంద్యాలలో 11,447, పశ్చిమగోదావరిలో 8,958, ఏలూరులో 5,671, ఎన్టీఆర్‌ జిల్లాలో 5,039 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్టు గుర్తించింది. అలాగే అత్యధికంగా కోనసీమ జిల్లాలో 61,237 మంది, కృష్ణాలో 60,208, కాకినాడలో 47,064, తూర్పుగోదావరిలో 30,729, నంద్యాలలో 23,370, పశ్చిమ గోదావరిలో 20,087, బాపట్లలో 18,563, ప్రకాశంలో 6,872, ఏలూరులో 11,577, ఎన్టీఆర్‌లో 10,137, శ్రీకాకుళం జిల్లాలో 8,289 మంది రైతులు నష్టపోయారని వ్యవసాయశాఖ తుది నివేదికలో పేర్కొంది. కాగా, తుఫాన్‌ ప్రభావిత ఆరు జిల్లాల్లో ఈనెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పౌసుమీ బసు నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల బృందం రెండు బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ సెంటర్‌లో కేంద్ర బృందానికి సంక్షిప్త సమాచారం ఇచ్చేందుకు సంబంధిత శాఖల ఉన్నతాధికారులంతా హాజరు కావాలని నిర్దేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande