కాలేజీల బంద్ పై మరోసారి సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) ప్రైవేట్ కాజీల బంద్ పై సీఎం రేవంత్ తనను మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు వారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెదిరించడానికే కాలేజీలను బంద్ చేశారని అన్నారు. ఆరు నెలల పాటు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్
CM revanth reddy


హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)

ప్రైవేట్ కాజీల బంద్ పై సీఎం రేవంత్

తనను మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు వారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బెదిరించడానికే కాలేజీలను బంద్ చేశారని అన్నారు. ఆరు నెలల పాటు బంద్ చేస్తే పిల్లల భవిష్యత్ ఏం కావాలని ప్రశ్నించారు. విద్య వ్యాపారం కాదని.. సేవ అని అన్నారు. ఫీజులు ఇస్తారా లేదా అని బంద్ చేయించి బెదిరిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంతాలు, పట్టింపులకు పోతే సమస్య పరిష్కారం కాదన్నారు. రూల్స్ ప్రకారం వెళదామంటే చెప్పండి సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. 100 శాతం రూల్స్ పాటించే కాలేజీలకు తక్షణమే బకాయిలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇక ఇటీవల కూడా సీఎం నిరసన చేస్తున్న కాలేజీలకు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande