రాముడి వారసులు కావాలా? ఔరంగజేబు వారుసులు కావాలా? జూబ్లీహిల్స్ ప్రజలు తేల్చుకోండి: బండి సంజయ్
తెలంగాణ, 9 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో శ్రీరాముడి వారుసులుగా మేము వస్తుంటే ఔరంగజేబు వారసులుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తున్నారని.. రాముడి వారసులు కావాలా? ఔరంగజేబు వారసులు కావాలా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలని కేంద్ర మంత్రి బండి
బండి సంజయ్


తెలంగాణ, 9 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో శ్రీరాముడి వారుసులుగా మేము వస్తుంటే ఔరంగజేబు వారసులుగా కాంగ్రెస్ పార్టీ వాళ్లు వస్తున్నారని.. రాముడి వారసులు కావాలా? ఔరంగజేబు వారసులు కావాలా జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ బైపోల్లో శ్రీరాముడి దమ్మేంటో, హిందూ ఓటు బ్యాంకు దమ్మెంటో చూపించాలని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింల గురించి ఓ వైపు కాంగ్రెస్, బీఆర్ఎస్ మాట్లాడుతుంటే హిందువులంతా చేతులు కట్టుకుని కూర్చోవాలా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కేవలం ముస్లింఓటర్లకే డబ్బులు పంచుతూ కనీసం హిందువుల ఇండ్లకు వెళ్లి వారి బాధలు కూడా వినడం లేదని ఆరోపించారు. బీజేపీ అంటే హిందూ, హిందూ అంటే బీజేపీ అని మరోసారి బల్లగుద్ది చెబుతున్నామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande