లేడీ వర్సెస్ రౌడీ మధ్య జూబ్లీహిల్స్ ఎన్నిక.. హరీష్ రావు
తెలంగాణ, 9 నవంబర్ (హి.స.) ఎన్నికల ముందు పోలీసులు బైండోవర్ చేసేది రౌడీలనే కదా? అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఎర్రగడ్డ మోతి నగర్ వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హరీశ్రావు హాజరయ్యా
హరీష్ రావు


తెలంగాణ, 9 నవంబర్ (హి.స.)

ఎన్నికల ముందు పోలీసులు

బైండోవర్ చేసేది రౌడీలనే కదా? అని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఎర్రగడ్డ మోతి నగర్ వాసవి బృందావనం అపార్ట్మెంట్ వాసుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఎన్నిక లేడీ వర్సెస్ రౌడీ మధ్య జరుగుతుందని అన్నారు. వాళ్లది రౌడీ కుటుంబం కాకపోతే పోలీస్ స్టేషన్లో నవీన్ యాదవ్ కుటుంబ సభ్యులను ఎందుకు బైండోవర్ చేశారని ప్రశ్నించారు. బైండోవర్ చేసిన వాళ్లని రౌడీ అనకపోతే ఏమంటారని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande