సమస్యకు ఆత్మహత్య.. పరిష్కారం కాదు.. కానిస్టేబుల్ సూసైడ్పై స్పందించిన సజ్జనార్
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. ''సమస్యకు ఆత్మహత్య.. పరిష్క
సజ్జనార్


హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)

ఆన్లైన్ బెట్టింగ్కు బానిసైన ఓ కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనపై ఆదివారం ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్పందించారు. 'సమస్యకు ఆత్మహత్య.. పరిష్కారం కాదు. మీ ప్రాణం చుట్టూ ఎన్నో బంధాలు, ఇంకెన్నో జీవితాలు ఆధారపడి ఉంటాయి. సమస్యలు వచ్చాయని, కష్టాలు ఎదురయ్యాయని క్షణికావేశంలో మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు es బంధాలను, వాళ్ళ జీవితాలను నరకప్రాయంగా మార్చేస్తాయి. వద్దు.. ఆత్మహత్య ఆలోచనే రానివ్వద్దు' అని ట్వీట్లో పేర్కొన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande