
జోగులాంబ గద్వాల, 9 నవంబర్ (హి.స.)
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా న్యాయవాదులు జోగులాంబ నుండి హైదరాబాద్ వరకు ఆదివారం పాదయాత్ర చేపట్టారు. ముందుగా న్యాయవాదుల బృందం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అక్కడినుండి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ పాదయాత్ర నిరంతరాయంగా వారం రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దేశంలో ఉన్న లాయర్లకు రక్షణ కల్పిస్తూ రక్షణ చట్టాలు అమలు చేయాలనే డిమాండ్ తో పాదయాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ చేరుకుని రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, హైకోర్టు జడ్జిలకు తమ సమస్యలు మరియు డిమాండ్లకు సంబంధించిన వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు