జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం.. నేటితో ముగియనున్న ప్రచారం
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది. జూబ్లీహిల్స్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలివగా ఇందులో ప్రధాన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా రిజిస్ట్రర్డ్ పార్టీలకు
జూబ్లీహిల్స్


హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రం ఆరు గంటలకు ముగియనుంది.

జూబ్లీహిల్స్లో మొత్తం 58 మంది అభ్యర్థులు బరిలో నిలివగా ఇందులో ప్రధాన గుర్తింపు పొందిన పార్టీలకు చెందిన వారు ముగ్గురు ఉండగా రిజిస్ట్రర్డ్ పార్టీలకు చెందిన వారు 26 మంది, ఇండిపెండెంట్లు 29 మంది ఉన్నారు. జూబ్లీహిల్స్లో మొత్తం 4.01 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరి కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 986 ఓటర్లు ఉండే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్లో ఏనాడు కూడా 50 శాతం పోలింగ్ జరిగిన దాఖలాలు లేవు. దీంతో ఓటింగ్ పాల్గొనే విధంగా అధికారులు ఓటింగ్ విలువ, ఓటర్లను చైతన్య పరిచేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. జూబ్లీహిల్స్లో 4,01,365 మంది ఓటర్లుగా ఉండగా ఇందులో ఎన్ఆర్ఎ ఓటర్లు 123 మంది, సర్వీసు ఓటర్లు 18 మంది, దివ్యాంగులు 1908 మంది, కొత్త ఓటర్లు 6859 మంది ఉన్నారు. 85 సంవత్సరాల కంటే పైబడిన వారు 2134 మంది ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో బ్యాలెట్యూనిట్లు 2442, కంట్రోల్ యూనిట్లు 569, వీవీప్యాట్లు 610 ఉపయోగిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande