చివరి రోజు ప్రచారానికి BRS భారీ ఏర్పాట్లు
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) నేటితో జూబ్లిహిల్స్ ఉపఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు చివరిరోజు ప్రచారంపై ప్రత్యేక దృష్టిపెట్టాయి. కాగా బీఆర్ఎస్ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ప్రచారంలో దూసుకు
జూబ్లీహిల్స్


హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) నేటితో జూబ్లిహిల్స్ ఉపఎన్నికల

ప్రచారానికి తెరపడనుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు చివరిరోజు ప్రచారంపై ప్రత్యేక దృష్టిపెట్టాయి. కాగా బీఆర్ఎస్ ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ప్రచారంలో దూసుకుపోతుండగా నేడు ఆకరిరోజు కావడంతో భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోతీనగర్ లో హరీష్ రావు బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ బైక్ ర్యాలీలో కేటీఆర్, ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత పాల్గొంటారు. షేక్ పేట నుండి యూసుఫ్ గూడ, రహమత్ నగర్, వెంగళరావునగర్, సోమాజిగూడ, బోరబండ వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. ఇక సాయంత్రంతో ప్రచారానికి బ్రేక్ పడనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande