
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)
బేగంపేట టూరిజం ప్లాజా ప్రాంగణంలో తెలంగాణ టెలివిజన్ డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన సినీ కార్మికుల కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. సమ్మేళనంలో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, సినీ పరిశ్రమకు చెందిన 38 సంఘాల ప్రతినిధులు, పలువురు ప్రముఖ నటులు, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ కార్మికుల సంక్షేమం, సమస్యల పరిష్కారం, ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అందరిదీ.. సినీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని తెలిపారు. సినీ పరిశ్రమలో సక్సెస్ రేట్ తక్కువ అని, రాజకీయాలు కూడా అంతేనని, రెండు రంగాలకూ పట్టుదల అవసరం అని కీలక వ్యాఖ్యలు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..