అనారోగ్యమా, అసంతృప్తా? బాధ్యతలు చేపట్టని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను ప్రభుత్వం నియమించినా ఇంకా చేపట్టలేదు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి చే
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు


హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలను ప్రభుత్వం నియమించినా ఇంకా చేపట్టలేదు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు పదవి చేపట్టిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వారం రోజుల వ్యవధిలోనే బాధ్యతలు తీసుకున్నప్పటికీ పీఎస్ఆర్ మాత్రం ఇప్పటికీ పదవిని స్వీకరించలేదు. అనారోగ్య కారణాల వల్లే ఆయన బాధ్యతలు చేపట్టలేదని కొందరు చెబుతున్నప్పటికీ, మంత్రి పదవిని బలంగా ఆశించిన ఆయనకు, ప్రస్తుతం ఇచ్చిన కార్పొరేషన్ చైర్మన్ పదవి పట్ల తీవ్ర విముఖత వ్యక్తం చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పీఎస్ఆర్ అనుచరుల్లో డైలమా నెలకొన్నది. ఆయన బాధ్యతలు తీసుకుంటారా? లేక పదవిని త్యజించి ఎమ్మెల్యేగానే కొనసాగుతారా? అన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande