
తెలంగాణ, 9 నవంబర్ (హి.స.)
గత కేసీఆర్ ప్రభుత్వం కొల్లూరు
డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్భంగా కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ కాలనీలో మంత్రులు పొంగులేటి, అజారుద్దీన్, ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డిలతో కలసి జూబ్లిహిల్స్ ఓటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. కొల్లూరు కాలనీ వాసులకు వారం రోజుల క్రితం ప్రభుత్వ పక్షాన ఇచ్చిన హామీలను 24 గంటల్లోనే అమలు చేశామని ఇది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనాదక్షతకు నిదర్శనమని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు