నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించరూ..! చెరకు రైతుల వేడుకోలు
నిజామాబాద్, 9 నవంబర్ (హి.స.) నష్టాల సాకుతో పదేళ్లుగా లే అవుట్తో మూతపడి ఉన్న బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఇక్కడి చెరుకు రైతులు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్రెడ్డికి
షుగర్ ఫ్యాక్టరీ


నిజామాబాద్, 9 నవంబర్ (హి.స.)

నష్టాల సాకుతో పదేళ్లుగా లే అవుట్తో మూతపడి ఉన్న బోధన్ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపించాలని ఇక్కడి చెరుకు రైతులు, నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ ఉద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్రెడ్డికి ఇటీవలే సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక అధికారాలతో కూడిన ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. కొద్ది రోజుల క్రితమే సచివాలయంలో ఆయన పదవీ బాధ్యతలు కూడా చేపట్టారు. ఇప్పుడు ఆయన చేతిలో మంత్రి పదవి లేకపోయినా, మంత్రికి ఏ మాత్రం తీసిపోని విధంగా మంత్రి వర్గ సమావేశంలో పాల్గొనే అధికారంతో పాటు, ప్రభుత్వ శాఖలపై అజమాయిషీ చేసే అధికారం ఉంది. దీంతో బోధన్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరించే విషయంలో సుదర్శన్రెడ్డి చొరవ తీసుకోవాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. ఆయన చేసే ప్రయత్నాలు తప్పక సత్ఫలితాలిస్తాయని, సీఎం రేవంత్ కూడా పాజిటివ్ రెస్పాండ్ అవుతారనే నమ్మకాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande