
కొమురం భీం ఆసిఫాబాద్, 9 నవంబర్ (హి.స.)
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంత మవుతున్నాయి. అయినా సంబంధిత రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. వాంకిడి మండలంలోని గోయగాం పరిధిలోని బీడీపీపీ ప్రభుత్వ భూమిలో అక్రమ కబ్జా చోటుచేసుకుంది. గతంలో ఆర్టీఏ చెక్ పోస్ట్ కోసం రైతుల నుంచి రెండు ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి బదులుగా మిగిలిన భూమికి పట్టా చేసి ఇస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చినా ఆ హామీ నెరవేరలేదు. ఆర్టీఏ చెక్ పోస్ట్ నిర్మాణం నిలిచిపోయి, ఆ స్థలం ఖాళీగా ఉండడంతో ఓ స్థానిక వ్యక్తి దానిని కబ్జా చేసి హోటల్ను ఏర్పాటు చేశాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..