వాహన చలాన్ పెండింగ్ అంటూ వాట్సాప్ మెసేజ్.. టచ్ చేస్తే లక్షల్లో డబ్బులు మాయం..
కరీంనగర్, 9 నవంబర్ (హి.స.) ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. కరీంనగర్ మండలం చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ అనే వ్యక్తి వాట్సాప్ నంబర్కు ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించారని మీ వాహన చలాన్ పెట్టింగ్లో ఉందని మీరు రెడ్ సిగ్నల్ దా
సైబర్ క్రైమ్


కరీంనగర్, 9 నవంబర్ (హి.స.)

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్ల మోసాలు ఎక్కువయ్యాయి. కరీంనగర్ మండలం చెర్లబుత్కూర్ గ్రామానికి చెందిన మధుకర్ అనే వ్యక్తి వాట్సాప్ నంబర్కు ట్రాఫిక్ నిబంధలను ఉల్లంఘించారని మీ వాహన చలాన్ పెట్టింగ్లో ఉందని మీరు రెడ్ సిగ్నల్ దాటారు అని మీ ఫొటోస్ చూసుకునేందుకు కింద ఉన్న ఏపీకె యాప్ డౌన్లోడ్ చేయండి అంటూ మెసేజ్ పెట్టారు. దీంతో స్పందించిన బాధితుడి అకౌంట్ నుండి రూ.70,000లు, అలాగే వారితో పాటు అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి బ్యాంక్ ఖాతా నుండి రూ.1,20,000లతో పాటు మరికొందరి బ్యాంకు అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కాజేశారు. దీంతో తాము మోసపోయామంటూ బాధితులు కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande