గంజాయి అక్రమ రవాణా సమాచారంతో పోలీసుల విస్తృత తనిఖీలు..
భద్రాద్రి కొత్తగూడెం, 9 నవంబర్ (హి.స.) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అనుమానిత వాహనాలను నిలుపుదల చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల
పోలీస్ తనిఖీలు


భద్రాద్రి కొత్తగూడెం, 9 నవంబర్ (హి.స.)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో ఆదివారం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలను చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద అనుమానిత వాహనాలను నిలుపుదల చేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో గంజాయి రవాణా జోరుగా జరుగుతుందన్న సమాచారంతో వాహనాల తనిఖీలను పటిష్టం చేశారు. వాహనాలను పరిశీలించడంతో పాటుగా వాహనాల ధ్రువీకరణ పత్రాలను లైసెన్సులను తనిఖీ చేస్తున్నారు. అనుమానితులను విచారించి పంపిస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్సై సూర్యం మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం డి.ఎస్.పి. సీఐ సూచనల మేరకు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande