ప్రైవేట్ ట్రావెల్ బస్సుకు తప్పిన ప్రమాదం.. ఒకేసారి మూడు వాహనాలు ఢీ ..
జోగులాంబ గద్వాల , 9 నవంబర్ (హి.స.) జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో 44వ జాతీయ రహదారిపై ఈ ఉదయం ట్రావెల్ బస్సులకు పెను ప్రమాదం తప్పింది. జల్లాపురం స్టేజి సమీపంలో హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తున్న రికవరీ చేసే గూడ్స్ వెహికల్ ముందు వెళ్
రోడ్డు ప్రమాదం


జోగులాంబ గద్వాల , 9 నవంబర్ (హి.స.)

జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలో 44వ జాతీయ రహదారిపై ఈ ఉదయం ట్రావెల్ బస్సులకు పెను ప్రమాదం తప్పింది.

జల్లాపురం స్టేజి సమీపంలో హైదరాబాద్ నుండి కర్నూల్ వెళ్తున్న రికవరీ చేసే గూడ్స్ వెహికల్ ముందు వెళ్తున్న టిప్పర్ వాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో వెనుక నుంచి వస్తున్న మరో కారు కూడా వచ్చి ఆ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రికవరీ గూడ్స్ వాహనం డ్రైవర్ మీరాజ్కు గాయాలు కావడంతో హుటాహుటిన 108లో కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కాగా ఈ సంఘటనతో వాహనాలు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ అంతరాయం జరగడంతో వాహనాలు నెమ్మదిగా వెళ్తున్నాయి. ఆ క్రమంలో హైదరాబాద్ నుండి కర్నూల్ వైపు మానవపాడు బస్టాప్ సమీపంలో స్లోగా వెళ్తూ ఆగిన ఓ ట్రావెల్ బస్సును మీనా ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. దాని వెనుకనే మరో లారీ ఢీ కొట్టడంతో ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక కేకలు వేశారు. వెనువెంటనే బస్సులో నుండి అందరూ కిందికి దిగి పోయారు. అయితే వాహనాలు స్లోగా వెళ్ళడంతో పెను ప్రమాదం తప్పిందని అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande