
రామేశ్వరం, తమిళనాడు.9 నవంబర్ (హి.స.)
సాధారణంగా పులస చేప ధర
ఎక్కువగా ఉంటుందని అందరికీ తెలుసు. పుస్తెలు అమ్ముకుని అయినా పులస తినాలనే సామెత కూడా ఉంది. అయితే ఇప్పుడు పులసను మించిన ధరతో రెండు చేపలు అమ్ముడుపోయాయి. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. రామేశ్వరం సమీపంలోని పంబన్ ఓడరేవు నుండి 80 పడవల్లో 600మందికి పైగా జాలర్లు చేపలవేటకు వెళ్లారు. కాగా ఉదయం గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద చేపల వేట చేపట్టగా వివిధ రకాల చేపలు దొరికాయి. అందులో ఓ వలకు రెండు పెద్ద క్యాట్ ఫిష్ లు చిక్కాయి. వాటిలో ఒకటి 22 కేజీలు మరొకటి 24 కేజీలు ఉండగా కేజీ రూ.3వేల చొప్పున అమ్మారు. దీంతో జాలర్లకు రూ.1.65 లక్షలు వచ్చాయి. అయితే ఈ చేపలకు అంత ధర పలకడానికి ఓ కారణం ఉంది. ఈ చేపల్లో ఎక్కువగా ఔషద గుణాలు ఉంటాయి. అంతే కాకుండా ఖరీదైన సూప్ ల తయారీలో వీటిని ఉపయోగిస్తుంటారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు