పెద్దపల్లి ఫాస్ట్క్ పోక్సో కోర్టు జడ్జిగా స్వప్నరాణి..
హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి
పోక్సో కోర్టు జడ్జి


హైదరాబాద్, 9 నవంబర్ (హి.స.)

రాష్ట్రవ్యాప్తంగా జరిగిన న్యాయమూర్తుల బదిలీల్లో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు జడ్జిలను బదిలీ చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్, అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీలతను సంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ ఫోక్సో కోర్టు జడ్జిగా బదిలిచేశారు. కరీంనగర్ జిల్లా డీఎల్ఎస్ఏ సెక్రెటరీ కే.వెంకటెశ్ను మేడ్చెల్ మల్కాజిగిరి ఫాస్ట్ ట్రాక్ ఫోక్సో కోర్టుకు, పెద్దపల్లి జిల్లా డీఎల్ఎస్ఏ సెక్రెటరీ కే. స్వప్నరాణిని పెద్దపల్లి ఫాస్ట్ ట్రాక్ ఫోక్సో కోర్టుకు న్యాయమూర్తిగా ట్రాన్స్ఫర్ చేశారు. బదిలీ అయిన జడ్జీలంతా ఒకటి రెండురోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande