రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక భేటీ
అమరావతి, 9 నవంబర్ (హి.స.)నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నం (Vishakapatnam) వేదికగా సీఐఐ సమ్మిట్ జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా సహచర కేబినెట్ మంత్రులు వివిధ దేశాలకు వెళ్లి సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆయా దేశాల ప్రముఖులు, వ్యాప
ఏపీ కేబినెట్


అమరావతి, 9 నవంబర్ (హి.స.)నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నం (Vishakapatnam) వేదికగా సీఐఐ సమ్మిట్ జరగనుంది. ఇప్పటికే ముఖ్యమంత్రితో సహా సహచర కేబినెట్ మంత్రులు వివిధ దేశాలకు వెళ్లి సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని ఆయా దేశాల ప్రముఖులు, వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. సదస్సు సమయం దగ్గరపడుతున్న తరుణంలో రాష్ట్ర కేబినేట్ రేపు (నవంబరు 10) భేటీ కానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ముఖ్యమంత్రి అధ్యక్షతన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandra Babu Naidu) అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినేట్ (Cabinet Meeting) సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై మంత్రివర్గంతో ముఖ్యమంత్రి చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సీఐఐ సదస్సు ప్రధాన ఎజెండాగా ఉండనుంది. ఈ సదస్సు ఏర్పాట్ల బాధ్యతను ఇప్పటికే మంత్రులతో పాటు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి అప్పగించారు. అదే విధంగా రాష్ట్రానికి రానున్న లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు కేబినేట్ ఆమోదం తెలిపి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయాల ద్వారా ఆంధ్రప్రదేశ్ లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. తద్వారా ఉద్యోగాల కల్పనకు ఆస్కారం ఏర్పడుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande