
పాట్నా 9 నవంబర్ (హి.స.)
: దేశంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు హాట్ టాపిక్‌గా మారాయి. బీహార్‌లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇవాళ్టి(ఆదివారం)తో ముగియనుంది. చివరి రోజు ఎన్నికల ప్రచారం కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. బీహార్ రెండో విడత ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలతో పాటు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఎం సహా పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రెండో విడతలో 122 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే 121 స్థానాలకు పోలింగ్ ముగిసింది. 14వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు వివేక్ జోషి, ఎస్‌ఎస్ సంధు.. ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ