
సూళ్లూరుపేట 9 నవంబర్ (హి.స.), చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండ్ కావడంలో చంద్రయాన్-2 విఫలమైనా.. ఆ ఆర్బిటర్ కీలక సమాచారాన్ని మాత్రం భూమిపైకి పంపుతూనే ఉంది. ఈ సమాచారం ఆధారంగా ఇస్రో కీలక విషయాలను వెల్లడించింది. తొలి పోలార్ మ్యాప్‌ను తాజాగా విడుదల చేసింది. చంద్రయాన్-2 ఆర్బిటల్ తన డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపెర్చర్ రాడార్ డేటాను ఉపయోగించి చంద్రుడి తొలి పోలార్ మెట్రిక్, ఎల్-బ్యాండ్ రాడార్ మ్యాప్‌లను రూపొందించింది. చంద్రుడి ఉపరితలం, ఉపరితలం కింద నిర్మాణాలను గుర్తించడానికి ఈ మ్యాప్‌లు శాస్త్రవేత్తలకు ఉపయోగపడనున్నాయి. మరీ ముఖ్యంగా జాబిల్లిపై ఉండే వనరులను వినియోగించడాన్ని, అదే సమయంలో చంద్రుడిపై ల్యాండింగ్ ప్రదేశాన్ని ఎంపిక చేయడానికి డేటా ఉపకరిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ