భారత ప్రధాని మోదీని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు
దిల్లీ , 9 నవంబర్ (హి.స.)దక్షిణాఫ్రికాలో జరగబోయే టీ20 సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బహిష్కరించారు. తాను మాత్రమే కాదు.. అమెరికా తరఫున ప్రతినిధులెవరూ ఆ సదస్సుకు హాజరు కాబోరని స్పష్టం చేశారాయన. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీని కాంగ్రెస్
మలేసియాలో మోదీ- ట్రంప్‌ భేటీ లేదు


దిల్లీ , 9 నవంబర్ (హి.స.)దక్షిణాఫ్రికాలో జరగబోయే టీ20 సదస్సును అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బహిష్కరించారు. తాను మాత్రమే కాదు.. అమెరికా తరఫున ప్రతినిధులెవరూ ఆ సదస్సుకు హాజరు కాబోరని స్పష్టం చేశారాయన. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోదీని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా చేసుకుని వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాను నవంబర్‌ 22-23 తేదీల్లో సౌతాఫ్రికాలో జరగబోయే జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కాబట్టి తనను తాను విశ్వగురుగా ప్రకటించుకున్న వ్యక్తి కచ్చితంగా ఆ సదస్సుకు వెళ్లి తీరతారు అంటూ మోదీని ఉద్దేశించి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ శనివారం ఓ ట్వీట్‌ చేశారు.

ఇక.. 2014లో మోదీ ప్రధానిగా తొలిసారి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటిదాకా జీ20 సదస్సులన్నింటికీ హాజరవుతూ వస్తున్నారు మోదీ. బ్రిస్బేన్, అంటాల్యా, హాంగ్‌జౌ, హాంబర్గ్, బ్యూనస్ ఎయిర్స్‌, ఓసాకా, రియాద్ (కరోనా కారణంగా వర్చువల్), రోమ్, బాలి, న్యూఢిల్లీల్లో జరిగిన జీ20 సదస్సుల్లో పాల్గొన్నారు. అయితే.. ట్రంప్‌ నేపథ్యంతో మోదీని ఇలా జైరాం టార్గెట్‌ చేయడం తొలిసారేం కాదు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande