ఆరోగ్యంపై అవగాహన పెంచడమే లక్ష్యం : ఎస్పీ రాహుల్ మీనా
అమలాపురం, 9 నవంబర్ (హి.స.)ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రతిఒక్కరికి ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెంచడమే తమ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ (Rahul Meena) మీనా అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సైక్లోథాన్ 5కె (Cyclothone 5k) సైకిల్ ర్
ఎస్పీ రాహుల్ మీనా


అమలాపురం, 9 నవంబర్ (హి.స.)ఫిట్ ఇండియా కార్యక్రమం ద్వారా ప్రతిఒక్కరికి ఆరోగ్య పరిరక్షణ అవగాహన పెంచడమే తమ లక్ష్యమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ (Rahul Meena) మీనా అన్నారు. ఆయన ఆధ్వర్యంలో సైక్లోథాన్ 5కె (Cyclothone 5k) సైకిల్ ర్యాలీని ఆదివారం నిర్వహించారు.

జిల్లాలో ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫిట్ ఇండియా (Fit India) కార్యక్రమానికి మద్దతుగా ర్యాలీ సాగింది. ఉదయం 7 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో ఎస్పీ రాహుల్ మీనా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

అమలాపురం పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన ఈ ర్యాలీ పేరూరు జంక్షన్ వరకు వెళ్లి తిరిగి జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకొని ముగిసింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత వేగవంతమైన జీవన విధానంలో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని (Mental Health) కాపాడుకోవడం అత్యంత అవసరం అన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమం ప్రధాన లక్ష్యం కూడా అదేనని పేర్కొన్నారు

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande