జనసేన పార్టీ అధికారిక ‘X’ హ్యాండిల్ హ్యాక్.. సైబర్ నేరగాళ్ల పన్నాగం..!
అమరావతి, 9 నవంబర్ (హి.స.) జనసేన పార్టీ (Jana Sena Party) అధికారిక ట్విట్టర్‌ (ప్రస్తుతం X) హ్యాండిల్‌ హ్యాకింగ్‌కు గురైంది. నిన్న రాత్రి (శనివారం) జరిగిన ఈ ఘటనతో పార్టీ సోషల్‌ మీడియా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. తెలియని సైబర్‌ నేరగాళ్లు (cyber criminals
జనసేన పార్టీ అధికారిక ‘X’ హ్యాండిల్ హ్యాక్.. సైబర్ నేరగాళ్ల పన్నాగం..!


అమరావతి, 9 నవంబర్ (హి.స.) జనసేన పార్టీ (Jana Sena Party) అధికారిక ట్విట్టర్‌ (ప్రస్తుతం X) హ్యాండిల్‌ హ్యాకింగ్‌కు గురైంది. నిన్న రాత్రి (శనివారం) జరిగిన ఈ ఘటనతో పార్టీ సోషల్‌ మీడియా వర్గాలు ఉలిక్కిపడ్డాయి. తెలియని సైబర్‌ నేరగాళ్లు (cyber criminals) అకస్మాత్తుగా ఖాతా నియంత్రణను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి (ఆదివారం) వరకు ఖాతా సైబర్ నేరగాళ్ల ఆధీనంలోనే ఉంది. నిత్యం పోలిటికల్ పోస్టులు కనిపించే జనసేన హ్యాండిల్లో హ్యాకింగ్‌కు గురైన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్స్, ట్రేడింగ్స్ సంబంధించిన రీ ట్వీట్ చేసిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ఇది చూసిన పార్టీ అభిమానులు, శ్రేణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. సైబర్ నేరగాళ్ల పన్నాగం ఏమై ఉండొచ్చని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి.

ఈ ఘటన వెలుగులోకి రాగానే పార్టీ నాయకత్వం అప్రమత్తమై, సైబర్‌ క్రైమ్‌ అధికారులను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఖాతా పునరుద్ధరణ కోసం సాంకేతిక బృందం కృషి చేస్తున్నట్లు సమాచారం. ఈ హ్యాకింగ్‌ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై పార్టీ వర్గాలు అధికారిక ప్రకటన త్వరలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande