మెగసెసె అవార్డును స్వీకరించిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ సంస్థ
మనీలా: 9 నవంబర్ (హి.స.)ప్రతిష్ఠాత్మకమైన ‘రామన్‌ మెగసెసె’ అవార్డును పొందిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ స్వచ్ఛంద సంస్థ.. దాన్ని తమ క్షేత్రస్థాయి సమన్వయకర్తలు, వాలంటీర్లు, మెంటార్లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. 2025కు గాను రామన్‌ మెగసెసె అవార్డును భార
మెగసెసె అవార్డును స్వీకరించిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ సంస్థ


మనీలా: 9 నవంబర్ (హి.స.)ప్రతిష్ఠాత్మకమైన ‘రామన్‌ మెగసెసె’ అవార్డును పొందిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ స్వచ్ఛంద సంస్థ.. దాన్ని తమ క్షేత్రస్థాయి సమన్వయకర్తలు, వాలంటీర్లు, మెంటార్లకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. 2025కు గాను రామన్‌ మెగసెసె అవార్డును భారత్‌కు చెందిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ స్వచ్ఛంద సంస్థకు ఆగస్టు 31న ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని మెట్రోపాలిటన్‌ థియేటర్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో 25 మందితో కూడిన ‘ఎడ్యుకేట్‌ గర్ల్స్‌’ సంస్థ ఈ అవార్డును స్వీకరించింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకురాలు సఫీనా హుసేన్, సీఈవో గాయత్రి నాయర్‌ లోబో మాట్లాడుతూ.. ‘‘తమ కుటుంబ, దేశ భవిష్యత్తు కోసం చదువుకోవడానికి ధైర్యంగా ముందుకొచ్చిన బాలికలతో సహా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కమ్యూనిటీ సభ్యులు, బాలికలకు అండగా నిలిచిన మా సంస్థకు చెందిన 55 వేల మంది వాలంటీర్లకు ఈ అవార్డును అంకితమిస్తున్నాం.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande