
తిరుమల, 9 నవంబర్ (హి.స.)ప్రముఖ వ్యాపారవేత్త.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తిరుమలలో కొలువైన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. స్వామివారి సుప్రభాత సేవలో (Suprabhata Seva) పాల్గొని వెంకటేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఆయన దర్శన సందర్భంగా దేవాలయ అధికారులు ఆహ్వానం పలికారు. దర్శన అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను ఇచ్చారు. దేవాలయ అధికారులు శాలువాతో సత్కరించి స్వామి వారి తీర్థప్రసాదాలను ముకేశ్ అంబానీకి అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV