
దిల్లీ, 9 నవంబర్ (హి.స.)దేశ రాజధాని దిల్లీ, ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇటీవల సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది సర్వీసులపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే (ATC System Failure In Delhi). దీనికి సంబంధించి తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలల ముందే దీని గురించి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ (ATC) గిల్డ్ ఇండియా పేర్కొంది.
జులైలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి సమస్యలు, అప్‌గ్రేడ్‌ల గురించి తెలియజేశామని ఏటీసీ పేర్కొంది. అయితే, తమ సూచనలను వారు పట్టించుకోలేదని ఆరోపించింది. అహ్మాదాబాద్ ప్రమాదం అనంతరం దీనికి సంబంధించి అధికారులకు తాము లేఖ రాశామని వెల్లడించింది. ఎయిర్ నావిగేషన్ సేవల్లో ఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థలు కాలానుగుణంగా సమీక్షించి, అప్‌గ్రేడ్ చేయడం అవసరమని పేర్కొన్నట్లు తెలిపింది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ