రాజకీయం వద్దు.. గోవింద నామమే ముద్దు
తిరుమల , 9 నవంబర్ (హి.స.)దేవుడి గుడికి దైవ దర్శనానికి.. ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్తాము. అంతేకాకుండా దేవాలయ (Temple) పరిసరాలను ఎంతో పవిత్రంగా భావిస్తాము. మడి, ఆచారం, సంప్రదాయాలకు నెలవుగా దేవాలయాన్ని భావిస్తాము. అలాంటి చోట భక్తికి, ఆచారానికి విరుద్ధం
తిరుమల


తిరుమల , 9 నవంబర్ (హి.స.)దేవుడి గుడికి దైవ దర్శనానికి.. ఆధ్యాత్మిక చింతన కోసం వెళ్తాము. అంతేకాకుండా దేవాలయ (Temple) పరిసరాలను ఎంతో పవిత్రంగా భావిస్తాము. మడి, ఆచారం, సంప్రదాయాలకు నెలవుగా దేవాలయాన్ని భావిస్తాము. అలాంటి చోట భక్తికి, ఆచారానికి విరుద్ధంగా ప్రవర్తించడమంటే మహాపాపమే అవుతుంది. కానీ ఇటీవల దేవాలయాల చుట్టూ మాత్రమే కాదు, దేవాలయాల వద్ద కూడా రాజకీయాలు ఎక్కువ అవుతున్నాయి. అందుకు తిరుమల (Tirumala) మినహాయింపు కాదన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఎంతో మంది ప్రముఖులు నిత్యం తిరుమల శ్రీవారిని (Srivaru) దర్శించుకుంటారు. వారిలో ప్రభుత్వ ఉద్యోగుల నుంచి న్యాయమూర్తులు, పారిశ్రామికవేత్తల దాకా ఉంటారు. మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులు తిరుమలకు రాని రోజు ఉండదంటే నమ్మశక్యం కాదేమో. అయితే రాజకీయ నాయకులు వచ్చి దర్శనం చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అదేదో ప్రెస్ క్లబ్ (Press Club) లా భావిస్తూ రాజకీయ వ్యాఖ్యలను చేస్తుంటారు. తిరుమలను రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారుస్తుంటారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) నిర్ణయించింది. రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా నిషేధం విధించింది

.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande