
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.)
పెళ్లిపై ఇటీవల బాలీవుడ్ నటి కాజోల్
చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. నటి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ భార్య జయాబచ్చన్ నేటి తరం అభిరుచులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ జనరేషన్ పిల్లకు తాను పెళ్లి చేసుకోవడం గురించి సలహాలు ఇవ్వబోనని స్పష్టం చేశారు. తాజాగా We the Women అనే ప్రోగ్రామ్ లో పాల్గొన్న ఆమె.. తన మనవరాలు నవ్య నవేలి నందా పెళ్లి గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
నవ్యకు కొద్దిరోజుల్లో 28 సంవత్సరాలు నిండుతాయని, ఆమె ఇప్పుడే పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపారు. అందుకే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలని చెప్తానన్నారు. ఒకప్పటి జనరేషన్ కు, నేటి జనరేషన్ కు మధ్య పరిస్థితులు పూర్తి మారిపోయాయని తెలిపారు. పెళ్లి విషయానికొస్తే.. అది ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చట్టపరమైన నిర్వచనాలు లేవని, నిర్వచించాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుండాలని సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు