
హైదరాబాద్, 1 డిసెంబర్ (హి.స.)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్
మంది సమంత(Samantha) డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్లో సోమవారం వీరిద్దరు ఒక్కటయ్యారు. ఈ వివాహం అతికొద్ది సమక్షంలో జరిగినట్లు సినీ వర్గాలు తెలిపాయి. మొదటి వీరిద్దరు లింగ భైరవ ఆలయంలో స్వామి దర్శనం చేసుకుని పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ఈ విషయం కాస్త బయటకు రావడంతో అది తెలుసుకున్న వారంతా కంగ్రాట్స్ చెబుతున్నారు. కాగా, ఇది సమంతకు, రాజ్ నిడిమోరుకు రెండో పెళ్లి కావడం గమనార్హం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..