మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు..!
ముంబై, 10 డిసెంబర్ (హి.స.)కొనుగోలుదారులకు తీపి కబురు. స్థానిక బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఒకే రోజు రూ.300 మేర ధర పతనమైంది. అయితే డిసెంబర్‌ 8న తులం బంగారం ధర రూ.1,30,430 ఉండగా, ప్రస్తుతం చూస్తే భారీగానే తగ్గుముఖం పట
gold


ముంబై, 10 డిసెంబర్ (హి.స.)కొనుగోలుదారులకు తీపి కబురు. స్థానిక బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. నిన్న ఒకే రోజు రూ.300 మేర ధర పతనమైంది. అయితే డిసెంబర్‌ 8న తులం బంగారం ధర రూ.1,30,430 ఉండగా, ప్రస్తుతం చూస్తే భారీగానే తగ్గుముఖం పట్టింది. దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గిందనే చెప్పాలి. అలాగే గత కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన ధరలకు కాస్త బ్రేక్ పడింది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్‌లో చోటు చేసుకున్న పరిణామాలు కారణమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు బంగారం నుంచి తమ పెట్టుబడులను తిరిగి ఈక్విటీ మార్కెట్లలోకి మళ్లించడం ఈ ధరల క్షీణతకు ప్రధాన కారణాలుగా నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం పసిడిపై తీవ్ర ప్రభావం చూపింది.

తాజాగా డిసెంబర్ 10న హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,29,430, ఉండగదా, 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 వద్ద కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం పెళ్లిళ్ల సీజన్ డిమాండ్ కారణంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ పతనం కొనుగోలుదారులకు కొంత ఉపశమనం ఇచ్చింది. అయినా తులం బంగారం ధర కొనాలంటే లక్షా 30 వేల రూపాయల వరకు పెట్టుకోవాల్సిందే.

వెండి ధరలు మాత్రం పైకి చేరాయి. గోల్డ్ రేట్ తగ్గుతున్నప్పటికీ, సిల్వర్ రేట్‌ మాత్రం పైపైకి చేరాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,99,100 వద్ద కొనసాగుతోంది. అంటే రెండు లక్షల రూపాయల వరకు ఉంది. ఇక దేశీయంగా చూస్తే కిలో వెండి ధర రూ.1,90,100 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,29,430, ఉండగదా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,18,640 వద్ద కొనసాగుతోంది.

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande