
హైదరాబాద్, 10 డిసెంబర్ (హి.స.) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఆధిపత్యం కొనసాగించారు. ఐసీసీ బుధవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో విరాట్ కోహ్లి రెండో స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికే నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్లో విరాట్ కోహ్లి అద్భుతంగా బ్యాటింగ్ చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. దాంతో రన్ మిషన్ ర్యాంకు గణనీయంగా మెరుగుపడింది.
ప్రస్తుతం నెంబర్ వన్ ప్లేస్ను చేరుకునేందుకు విరాట్ కోహ్లి.. అగ్రస్థానానికి చేరుకునేందుకు కేవలం ఎనిమిది రేటింగ్ పాయింట్ల దూరంలో ఉన్నాడు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..