మొత్తం 85,000 వీసాలు రద్దు చేసిన అమెరికా
వాషింగ్టన్ డిసి, 10 డిసెంబర్ (హి.స.)అమెరికాలో జనవరి నుంచి 85,000 వీసాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ''ఎక్స్'' (గతంలో ట్విట్టర్) వేదికగా సంచలన ప్రకటన చేసింది. ''మేక్ అమెరికా సేఫ్ అగైన్'' అనే నినాదంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అమ
us-cancels-85000-visas


వాషింగ్టన్ డిసి, 10 డిసెంబర్ (హి.స.)అమెరికాలో జనవరి నుంచి 85,000 వీసాలను రద్దు చేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా సంచలన ప్రకటన చేసింది. 'మేక్ అమెరికా సేఫ్ అగైన్' అనే నినాదంతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో ఈ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఈ భారీ సంఖ్యలో వీసాల రద్దు, అధ్యక్షుడు ట్రంప్ గతంలో అమలు చేసిన కఠినమైన వలస విధానాలను, జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధానాన్ని ప్రతిబింబిస్తోంది.

గతంలో కూడా ట్రంప్ పాలనలో పలు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించడం, గ్రీన్ కార్డు జారీ ప్రక్రియ (Green Card Issuance Process)ను కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకున్నారు. తాజా వీసాల రద్దు నిర్ణయం కూడా ఆ దేశ భద్రతను, పౌరుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ 'అమెరికా ఫస్ట్' విధానంలో భాగంగానే ఈ తాజా నిర్ణయం అమలవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా, ముఖ్యంగా వలసదారులపై ఆధారపడిన రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande