
ముంబై, 11 డిసెంబర్ (హి.స.)గరిష్టానికి చేరువలో ఉన్న బంగారం ధర ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతోంది. మరోవైపు వెండి మాత్రం పరుగులు పెడుతోంది. భౌగోళిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో వెండి, బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది (Gold prices). goodreturns వెబ్‌సైట్ ప్రకారం హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2, 09, 000 వద్ద కొనసాగుతోంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ. 2, 01, 000గా ఉంది.
మరోవైపు బంగారం ధర మాత్రం నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాములకు రూ.110 మేర తగ్గింది. ఈ రోజు (డిసెంబర్ 11న) ఉదయం 10:30 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1, 30, 200కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 1, 19, 350కి చేరింది (live gold rates). ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 30, 350కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 1, 19, 500కి చేరుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV