బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల మోత, ఇద్దరు మృతి
రోడ్ ఐలాండ్లో 14 డిసెంబర్ (హి.స.) అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ బిల్డింగ్లో పరీక్ష జరుగుతుండగా శనివారం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డా
అమెరికాలో కాల్పులు


రోడ్ ఐలాండ్లో 14 డిసెంబర్ (హి.స.)

అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్లోని బ్రౌన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ బిల్డింగ్లో పరీక్ష జరుగుతుండగా శనివారం దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఓ దుండగుడు వర్సిటీలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఏడంతస్తుల బారస్ అండ్ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజినీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతున్నదని వెల్లడించారు.

నిందితుడి కోసం వెతుకుతున్నట్లు మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు మరణించారని, గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకగా ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande