‘అఖండ 2’ లో శివుడు.. తన పెర్ఫార్మెన్స్‌తో గూస్‌బంప్స్ తెప్పించిన‌ ఈ నటుడు ఎవరంటే?
అమరావతి, 14 డిసెంబర్ (హి.స.)గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లెటెస్ట్ సినిమా అఖండ 2: తాండవం. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి సినిమాను తెరకెక్కించిన బోయపాటి శీను ఈసారి మరిన్ని హంగులతో అఖండ
Know About Bollywoood Actor Tarun Khanna


అమరావతి, 14 డిసెంబర్ (హి.స.)గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన లెటెస్ట్ సినిమా అఖండ 2: తాండవం. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా అఖండ సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. మొదటి సినిమాను తెరకెక్కించిన బోయపాటి శీను ఈసారి మరిన్ని హంగులతో అఖండ 2ను తెరకెక్కించారు. డిసెంబర్‌ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అఖండ 2 సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దైవ భక్తి, హిందూత్వం, సనాతన ధర్మం వంటి అంశాలను అఖండ 2 సినిమాలో చాలా చక్కగా చూపించారని ప్రశంసలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మొదటి రోజే రూ. 60 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన అఖండ 2 మూవీ బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. కాగా ఈ మూవీలో భారీ తారగణమే ఉంది. సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించగా, బజరంగీ భాయిజాన్ ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురిగా అద్భుతమైన పాత్ర పోషించింది. అలాగే ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, , హర్ష, జగపతి బాబు, రచ్చ రవి, అయ్యప్ప తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande