‘అఖండ 2’ను వీక్షించిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. బాలయ్య మూవీ గురించి మోహన్ భగవత్ ఏమన్నారంటే?
ఢిల్లీ, 14 డిసెంబర్ (హి.స.) ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరానికి అర్థవంతంగా, ప్రభావవంతంగా చేరవేసే కథాంశంతో రూపొందిన
RSS Chief Mohan Bhagwat Applauds


ఢిల్లీ, 14 డిసెంబర్ (హి.స.) ఇటీవల విడుదలైన ‘అఖండ 2’ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. దేశం, ధర్మం, దైవం వంటి భారతీయ శాశ్వత విలువలను నేటి తరానికి అర్థవంతంగా, ప్రభావవంతంగా చేరవేసే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది.

ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ జీ ‘అఖండ 2’ చిత్రాన్ని ప్రశంసిస్తూ, సినిమా అఖండ విజయాన్ని సాధించాలని దర్శకుడు బోయపాటి శ్రీను ని ఆశీర్వదించారు. సమాజానికి సానుకూల దిశను చూపించే, విలువలతో కూడిన చిత్రాలు మరింతగా రావాలని ఆయన ఆకాంక్షించారు . దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సందర్భంగా మాట్లాడుతూ -“దేశం, ధర్మం, దైవం వంటి మూల విలువలను నేటి తరానికి గుర్తు చేయాలనే సంకల్పంతో ‘అఖండ 2’ను రూపొందించాం. ఈ ప్రయత్నానికి మోహన్ భగవత్ జీ ఆశీర్వాదం లభించడం మా టీమ్ కు అపారమైన గౌరవం. ఇది మాకు మరింత బాధ్యతను, స్ఫూర్తిని ఇచ్చింది” అని తెలిపారు.భారతీయ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక భావనలు, దేశభక్తి వంటి అంశాలను సమకాలీన కథన శైలితో మేళవిస్తూ రూపొందిన ‘అఖండ 2’ సినిమా ప్రేక్షకులను ఆలోచింపజేయడమే కాకుండా భావోద్వేగంగా కూడా ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా యువతలో ధర్మబోధ, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతను నాటి ప్రయత్నం ఈ చిత్రంలో స్పష్టంగా కనిపిస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande