
ముంబై, 15 డిసెంబర్ (హి.స.)దేశంలో బంగారం అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా మహిళలు బంగారానికి ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలలో బంగారం కొనేందుకు ఇష్టపడుతుంటారు. అయితే బంగారం ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి. సామాన్యులు సైతం గ్రాము బంగారం కొనాలంటే భయపడే రోజులు వచ్చేశాయి. గడిచిన వారం రోజుల్లో తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు చాలా మారిపోయాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దేశీయంగా తులం బంగారం ధర రూ.1,33,900 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,740 ఉంది.
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,900 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,740 ఉంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV