మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులంపై ఎంతో తెలిస్తే..!
ముంబై, 16 డిసెంబర్ (హి.స.)ఇటీవల కాలం నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. ప్రస్తుతం తులం బంగారం కొనుగోలు చేయాలంటే 1 లక్ష 35 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. గుడ్‌రిటర్న్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. నిన్నటి నుంచి ఉదయ
Gold


ముంబై, 16 డిసెంబర్ (హి.స.)ఇటీవల కాలం నుంచి పరుగులు పెడుతున్న బంగారం ధరలు కాస్త ఉపశమనం కలిగించాయి. ప్రస్తుతం తులం బంగారం కొనుగోలు చేయాలంటే 1 లక్ష 35 వేల వరకు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. గుడ్‌రిటర్న్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. నిన్నటి నుంచి ఉదయం వరకు తులం బంగారం ధర రూ.1,35,380 ఉండగా, తాజాగా రూ.1520 తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం తులం ధర రూ.1,33,860కి చేరుకుంది.

మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది.

ఇక వెండిపై కూడా భారీగానే తగ్గుముఖం పట్టింది. ఉదయం వరకు అంటే ఆరు గంటల సమయానికి సిల్వర్‌ ధర 2 లక్షల 3100 వద్ద ట్రేడవ్వగా, ప్రస్తుతం 3900 రూపాయలు దిగి వచ్చి కిలో వెండి ధర రూ.1,99,100 వద్ద కొనసాగుతోంది. అదే హైదరాబాద్‌లో రూ.2,11,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,33,860 ఉంది. ఇక ఢిల్లీ లో రూ.1,34,010 వద్ద ఉండగా, ముంబైలో తులం ధర రూ.1,33,860 వద్ద కొనసాగుతోంది.

అమెరికా డాలర్ బలహీనపడటం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్నాయని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. వీటికి తోడు ప్రపంచవ్యాప్తంగా వివిధ కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేస్తుండటం, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరగడం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande