తగ్గని బంగారం జోరు.. మళ్లీ ఊపందుకుంటున్న ధరలు.. తులం ఎంతంటే?
ముంబై, 18 డిసెంబర్ (హి.స.) గత రెండ్రూజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకొని ఆల్ టైం రికార్డ్ స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే భారీగా తులం బంగారంపై రూ.650 పెరగ్గా.. ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం నుంచి గురువారం మధ్
gold


ముంబై, 18 డిసెంబర్ (హి.స.)

గత రెండ్రూజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకొని ఆల్ టైం రికార్డ్ స్థాయి వద్ద కొనసాగుతున్నాయి. నిన్న ఒక్కరోజే భారీగా తులం బంగారంపై రూ.650 పెరగ్గా.. ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం నుంచి గురువారం మధ్య కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో డిసెంబర్ 18 గురువారం ఉదయం ఆరు గంటలకు మార్కెల్‌తో 24 క్యారెట్ల తులం బంగారం రూ. 1,34,520 వద్ద కొనసాగుతుంది. బుధవారం ఉదయం రూ.650 పెరిగిన తర్వాత రూ. 1,34,510 గా ఉన్న తులం బంగారం ధర ఇవాళ ఉదయానికి తులంపై రూ. 10 పెరిగి ప్రస్తుతం రూ. 1,34,520 కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,23,310 వద్ద కొనసాగుతుంది.

ఇక బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. నిన్న ఒక్క రోజే ఏకంగా కేజీ బంగారంపై రూ.11 వేలు పెరగ్గా.. బుధవారం నుంచి గురువారం మధ్యలో కాస్త స్వలంగా పెరిగి హాల్‌ టైం హైకి చేరుకున్నాయి. దీంతో దేశీయ మార్కెట్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,08,100గా కొనసాగుతుంది. కాబట్టి దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,670 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,460 వద్ద కొనసాగుతోంది.

ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,34,520 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,310 వద్ద కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande