
తాడేపల్లి, 19 డిసెంబర్ (హి.స.)
వైసీపీ (YCP) నేత.. హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) తాడేపల్లి పోలీసుల స్టేషనుకు వెళ్లారు. అక్కడ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఈ క్రమంలో పోలీసులు మాధవ్ ను విచారించారు. అనంతరం సీఆర్పీసీ 41ఏ నోటీసులను ఇచ్చి పంపించారు. కేసు విచారణకు సహకరించాలని సూచించారు. అయితే గతంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తాడేపల్లిలో మంత్రి నారా లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీనిపై టీడీపీ నేతలు తాడేపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాప్తాడు పర్యటనలో పోలీసులు తగిన భద్రత కల్పించకపోవడంపై మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అదే క్రమంలో మంత్రి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆతనిపై కేసు నమోదైంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV