
బద్వేలు 19 డిసెంబర్ (హి.స.) :ఒక వ్యక్తిని ఆపి దోచుకోవడం.. ఒక ఇంట్లో దొంగలుపడి నగలు, నగదు తీసుకెళ్లడం పాతపద్ధతి. మనిషిని మాటల్లో పెట్టి అతని అకౌంట్లలో నుంచి సొమ్ము దోచుకోవడం సైబర్‌నేరగాళ్లనయా దోపిడీ. ఇంతకు ముందు చాలా వరకు పొట్టకూటికోసం దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు పక్కా వ్యూహంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి హైటెక్ మోసాలకు పాల్పడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త పద్ధతులతో దోపిడీ చేస్తున్నారు. వీరి బారిన పడిన వారిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా ఉండటం విశేషం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ