ఐటీ.మంత్రి.నారా.లోకేష్.నేడు.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు
అమరావతి, 19 డిసెంబర్ (హి.స.): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి (HRD), ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విస్తృతంగా పర్యటించనున్నారు.. పర్యటనలో భాగ
ఐటీ.మంత్రి.నారా.లోకేష్.నేడు.తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటించనున్నారు


అమరావతి, 19 డిసెంబర్ (హి.స.): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి (HRD), ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విస్తృతంగా పర్యటించనున్నారు.. పర్యటనలో భాగంగా ఉదయం 7.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, ఉదయం 8.05 గంటలకు విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం 8.10 గంటలకు విమానంలో ప్రయాణించి, ఉదయం 8.45 గంటలకు రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం ప్రభుత్వ కళాశాల (Government Arts College)కు చేరుకుని, అక్కడ నూతనంగా నిర్మించిన భవనాలను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు కొనసాగనుంది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి చేరుకుని, అక్కడ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande