రాష్ట్రంలో జనాభా నిర్వహణ పథకం ఉగాది నుంచి అమలు
అమరావతి, 19 డిసెంబర్ (హి.స.):రాష్ట్రంలో జనాభా నిర్వహణ పథకం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం తరహాలో ఉగాది నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. కలెక్టర్ల సదస్సులో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశంపై సీఎం మాట్ల
రాష్ట్రంలో జనాభా నిర్వహణ పథకం ఉగాది నుంచి అమలు


అమరావతి, 19 డిసెంబర్ (హి.స.):రాష్ట్రంలో జనాభా నిర్వహణ పథకం తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కుప్పం తరహాలో ఉగాది నుంచి ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేస్తామన్నారు. కలెక్టర్ల సదస్సులో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన అంశంపై సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటు సున్నాకు చేరుకోవాలన్నారు. కాగా, ‘నైపుణ్యం’ పోర్టల్‌ పనితీరుపై నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులు వీడియో ప్రదర్శించారు. పోర్టల్‌లో ఏం అందుబాటులో ఉంటాయనేది అందులో చూపించారు. ఒక ప్లంబర్‌ను తెలుగులో ఏఐ టెక్నాలజీ ద్వారా ఇంటర్వ్యూ చేసిన వీడియో ప్రదర్శించారు. కాగా, ఉద్యోగ కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ‘మీరేం చేస్తారో నాకు తెలియదు. ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం. ఇప్పటివరకూ 4.84లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అని చెబుతున్నారు. మొత్తం 20లక్షల ఉద్యోగాల పేర్లతో సహా డ్యాష్‌బోర్డులో కనిపించాలి. ఏ రంగంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయో ప్రణాళిక రూపొందించాలి.’’ అని స్పష్టం చేశారు. అమరావతిలో జీవ వైవిధ్యం సాధించాల్సి ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande