
ముంబై, 19 డిసెంబర్ (హి.స.) ప్రతి రోజు బంగారం ధరల్లో మార్పుచేర్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపు ధర పెరుగుతోంది. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం సామాన్యుడు గ్రాము బంగారం కొనాలంటేనే భయపడే రోజులు వచ్చాయి. ఇప్పుడు పది గ్రాముల బంగారం కొనాలంటేనే లక్షా 35 వేల వరకు చెల్లించుకోవాల్సిందే.
అయితే ప్రతి రోజు ఉదయం 10 గంటల సమయంలో బంగారం ధరలు అప్‌డేట్ అవుతుంటాయి. ఈ సమయంలో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు. ప్రస్తుతం శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 660 రూపాయల వరకు తగ్గింది. దీంతో ఇప్పుడు తులం ధర రూ.1,34,180 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. అందుకే చాలా మంది బంగారం, వెండి కొనుగోలులో బిజీగా ఉన్నారు. చాలా మంది వ్యక్తిగత ఉపయోగం కోసం, వారి భవిష్యత్తు కోసం కూడా బంగారం, వెండిని కొనుగోలు చేస్తారు. మీరు కూడా ఇలాంటిదే ఆలోచిస్తుంటే, కొనుగోలు చేసే ముందు బంగారం, వెండి ధరలను ఖచ్చితంగా తనిఖీ చేయాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV